భారతదేశం, మే 7 -- Agadha Teaser: టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన ఎంఎస్ రాజు.. గత కొంతకాలంగా దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. రొమాంటిక్ డ్రామాలు, యూత్ ఫుల్ సినిమాల తర్వాత ఆయన మొదటిసారిగా హారర్ జోనర్‌ను ఎంచుకుని తెరకెక్కించిన చిత్రం 'అగధ'. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించింది.

టీజర్ ప్రారంభంలోనే కామాక్షి భాస్కర్ల చెప్పే డైలాగులు కథలోని గంభీరతను పరిచయం చేశాయి. "మానవ మేధస్సుకు అందని అతీత శక్తులు ఈ ప్రపంచంలో ఉన్నాయి.. అవే ఆత్మలు, భూతాలు" అంటూ ఆమె చెప్పే మాటలు భయాందోళన కలిగిస్తున్నాయి. అలాంటి ఒక మిస్టరీ శక్తే ఈ 'అగధ' అని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.

మరో నటి ఉల్కా గుప్తా.. "అగధ వచ్చేసింది" అని చెప్పడం ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతోంది. సినిమాలో ఒక తల తెగిప...