భారతదేశం, ఆగస్టు 23 -- దేశీయ ద్విచక్ర వాహన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న బజాజ్ ఆటో కంపెనీ ఎట్టకేలకు అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది! పూర్తిగా ఆఫ్‌రోడ్ రైడింగ్ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ బైక్‌కు సంబంధించిన రోడ్డు పరీక్షలు భారత్‌లో జోరుగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది 2026 చివరి నాటికి ఈ బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

బ్రెజిల్ మార్కెట్‌లో తొలుత విడుదల కానున్న ఈ బజాజ్ అడ్వెంచర్ బైక్.. ఇండియాలో ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కానుకగా లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

తమ సంస్థ నుంచి కొత్త ఆన్-రోడ్/ఆఫ్-రోడ్ బైక్​ని ఆశించవచ్చని బజాజ్ బ్రెజిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాల్డైర్ ఫెరీరా ఇటీవలే తెలిపారు. ఇప్పటిక...