భారతదేశం, ఏప్రిల్ 15 -- Adivi Sesh Dacoit: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో అడివి శేష్ తన సక్సెస్ ట్రాక్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. అతని లేటెస్ట్ మూవీ 'డెకాయిట్' (Dacoit) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సుమారు రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా.. విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక సినిమా బడ్జెట్‌లో సగానికి పైగా మొత్తాన్ని కేవలం వారం రోజుల్లోనే రికవరీ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ క్రమంలో అడివి శేష్ తన సినిమా సక్సెస్ గురించి హిందుస్థాన్ టైమ్స్ తో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

సాధారణంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు సోమవారం నుంచి వసూళ్లు తగ్గుముఖం పడతాయి. కానీ 'డెకాయిట్' విషయంలో సీన్ రివర్స్‌లో ఉంది. "మంగళవారం ఉదయం బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే.. గంటకు ...