భారతదేశం, మార్చి 21 -- ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. రెండే పేర్లు వినిపిస్తున్నాయి! అవే.. 'ధురంధర్​', 'ఆదిత్య ధర్​'. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. 1 మినిట్​ రీల్స్​ని కూడా సరిగ్గా చూడలేక స్క్రోల్​ చేసేస్తున్న నేటి కాలంలో ఏకంగా 7 గంటల సినిమా తీసి, సినిమా మధ్యలో బాత్​రూమ్​కి వెళితే, ఏం మిస్​ అయిపోతామో అనుకుంటూ ప్రేక్షకులు సీట్లకే అతుక్కుపోయే విధంగా ధురంధర్​ని రూపొందించిన దర్శకుడు ఆదిత్య ధర్​పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆదిత్య ధర్​ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్​గా మారింది. ఈ నేపథ్యంలో ఆదిత్య ధర్​ నెట్​ వర్త్​ గురించి, ఆయన లగ్జరీ లైఫ్​ గురించి ఇక్కడ తెలుసుకోండి.

ఆదిత్య ధర్ ప్రయాణం ఒక సినిమా స్క్రిప్ట్‌లానే ఆసక్తికరంగా ఉంటుంది. దిల్లీకి చెందిన ఈయనకు చిన్నప్పటి నుంచి చదువు కంటే క్రికెట్ అంటేనే ప్రాణం. లెఫ్ట్ ఆర్మ్ స...