భారతదేశం, ఆగస్టు 24 -- Actor Prince Cecil Wedding: టాలీవుడ్ యంగ్ హీరో, 'బస్ స్టాప్' ఫేమ్ ప్రిన్స్ సెసిల్ (Prince Cecil) ఒక ఇంటివారయ్యారు. సాయి ప్రతిమ (Sai Prathima) అనే యువతిని ఆయన వివాహం చేసుకున్నారు. న్యూజిలాండ్‌లోని ప్రశాంతమైన, అందమైన 'వానకా' (Wanaka) ప్రాంతంలో అత్యంత ఘనంగా ఈ పెళ్లి వేడుక జరిగింది.

ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య తెలుగు సాంప్రదాయ బద్ధంగా నటుడు ప్రిన్స్ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇవి నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

సాంప్రదాయ దుస్తుల్లో కొత్త జంట ఎంతో ముచ్చటగా కనిపించింది. న్యూజిలాండ్ ప్రకృతి అందాల నడుమ జరిగిన ఈ వివాహ వేడుక సినీ ప్రియులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

దర్శకుడు తేజ రూపొందించిన 'నీకు నాకు డాష్ డాష్' సినిమాతో ప్ర...