భారతదేశం, ఏప్రిల్ 18 -- నటుడు ప్రకాశ్‌రాజ్ తాను చేసే కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. తాజాగా కూడా రామలక్ష్మణుల మీద మాట్లాడారు. దీంతో చాలా హిందూ సంఘాలు ప్రకాశ్‌రాజ్‌ను విమర్శిస్తున్నాయి.

అంతేకాదు ప్రకాశ్‌రాజ్ మీద పరువు నష్టం దావా దాఖలైంది. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఈ పరువు నష్టం దావా దాఖలు చేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాశ్‌రాజ్ మాట్లాడారని విమర్శించారు. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కావాలనే రామలక్ష్మణులపై వ్యాఖ్యానించారని పేర్కొన్నారు.

కేరళలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో ప్రకాశ్‌రాజ్ పాల్గొన్నాడు. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుతూ.. రామాయణాన్ని గురించి కామెంట్స్ చేశాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చిన ...