భారతదేశం, సెప్టెంబర్ 18 -- Abhishek Sharma: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) హిస్టారిక్ రికార్డు సృష్టించాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల విభాగంలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తనకు చేసిన మెసేజ్ గురించి అభిషేక్ వెల్లడించాడు.

టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ నిజంగానే షేక్ ఆడించాడు. గురువారం (సెప్టెంబర్ 17) రాత్రి పరుగుల సునామీని చూపించాడు. 30 బాల్స్ లోనే సెంచరీ బాదేశాడు. అలాగే ఇండియా తరపున గతంలో రోహిత్ శర్మ పేరిట ఉన్న వేగవంతమైన టి20 సెంచరీ రికార్డును బద్ధలు కొట్టాడు.

అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం అభిషేక్ శర్మ తన సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట...