భారతదేశం, ఏప్రిల్ 29 -- AATA: టీవీ షోల్లో డ్యాన్స్ రియాలిటీ షోలకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఓంకార్ యాంకర్ గా వచ్చే 'ఆట' డ్యాన్స్ షోకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు అదే పేరుతో జీ తెలుగులో 'ఆట' డ్యాన్స్ రియాలిటీ షో కొనసాగుతోంది. ఈ షో ఎండింగ్ కు చేరుకుంది. ఫైనల్ ఎపిసోడ్ వచ్చే వీకెండ్ లోనే జరుగుతుంది.

తెలుగు టెలివిజన్ రంగంలో వినూత్నమైన రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు, ఇప్పుడు మరో సంచలన ముగింపు వేడుకకు సిద్ధమైంది. డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' గ్రాండ్ ఫినాలే ఈ వారాంతంలో అట్టహాసంగా జరగనుంది. మే 2, 3వ తేదీల్లో రాత్రి 9 గంటలకు రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఈ వేడుక, బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది.

నిహారిక కొణిదెల, రాధిక శరత్ కుమార్, రఘు మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ ఆట సీజన్​ గ్రాండ్​ ఫినాలే మర...