భారతదేశం, ఏప్రిల్ 27 -- Aamir Khan Sai Pallavi: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సాధారణంగా సినిమాల విషయంలో చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. అలాంటిది ఒక సినిమా చూస్తూ ఆయన బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా, దక్షిణాది స్టార్ నటి సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన 'ఏక్ దిన్' సినిమా కోసం నిర్వహించిన 'ఏక్ దిన్ కీ మెహఫిల్' కార్యక్రమంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ఏక్ దిన్ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రత్యేక దృశ్యాలను వీక్షిస్తున్న సమయంలో అమీర్ ఖాన్ తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు. తన కళ్ల నుంచి వస్తున్న నీళ్లను టీ-షర్ట్‌తో తుడుచుకుంటూ ఆయన కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పక్కనే ఉన్న సాయి పల్లవి, జునైద్ ఖాన్ ఆయనను ఓదారుస్తూ కనిపించారు....