భారతదేశం, మార్చి 26 -- ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ సెన్సేషనల్ రన్‌తో దూసుకుపోతోంది. ఈ యాక్షన్ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఆలియా భట్ నుంచి కంగనా రనౌత్ వరకు, అలాగే అల్లు అర్జున్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు చాలామంది స్టార్లు ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో చిత్ర బృందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అయితే ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఈ రణ్‌వీర్ సింగ్ సినిమా గురించి స్పందించాడు. తాను ఇంకా ఈ సినిమా చూడకపోయినా, ఎక్కడ విన్నా ఈ సినిమా గురించిన ప్రశంసలే వినిపిస్తున్నాయని ఆమిర్ చెప్పడం విశేషం.

2026 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీలో (ఐఎఫ్ఎఫ్‌డీ) రెండో రోజు కార్యక్రమంలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ ఈ...