భారతదేశం, అక్టోబర్ 7 -- Aadarsha Kutumbam: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం'. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నిజానికి ఈ శుక్రవారం (అక్టోబర్ 9, 2026) ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది.

వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'ఆదర్శ కుటుంబం'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సారి గురూజీ త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఎలా తీర్చుదిద్దుతున్నారనే క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఈ మూవీ రిలీజ్ ను పదే పదే పోస్ట్ పోన్ చేయడం నిరాశ కలిగిస్తోంది. ముందు 2026 సమ్మర్, ఆ తర్వాత అక్టోబర్ 2, అనంతరం అక్టోబర్ 9.. ఇలా సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు.

అక్టోబర్ 9న కచ్చితంగా ఆదర్శ కుటుం...