భారతదేశం, డిసెంబర్ 12 -- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో సర్పంచ్ గా విజయం సాధించారు.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన పోరులో రామచంద్రారెడ్డి విక్టరీని అందుకున్నారు.

రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆయన కుమారుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చాలా చురుకుగా వ్యవహారించారు. మరోవైపు అధికార కాంగ్రెస్ లోని కీలక నేతలు. ఇక్కడ హస్తం పార్టీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఓ రకంగా ఇక్కడ బీఆర్ఎస్ ను ఓడించి. జగదీశ్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టాలని భావించారు. కానీ చివరగా రామచంద్రారెడ్డే విజయం సాధించటంతో. బీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి, సర్పంచ్ గా గెలిచిన 95 ఏండ్ల గుంటకండ్ల రామ...