Hyderabad, Oct. 26 -- 2023 సంవత్సరానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ల డేటా ప్రకారం తెలంగాణ లోపల, బయట నడుస్తున్న బస్సులు అన్ని కలిపి రూ. 10 కోట్లకు పైగా జరిమానాలు చెల్లించాల్సి ఉంది. 30 వేలకు పైగా బస్సులకు సంబంధించి 90 వేల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇటీవల కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘన గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. తర్వాత మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాదం జరిగిన బస్సుపై అతివేగం, అనధికార పార్కింగ్, నో ఎంట్రీ జోన్లలోకి ప్రవేశించడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి రూ.28,000 విలువైన 16 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే తెలంగాణలో అనేక ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై భారీగా చలాన్లు ఉన్...