భారతదేశం, జూన్ 29 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లను నిర్ణయించడంలో అత్యంత కీలకమైన అంశం 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్'. ప్రస్తుత బేసిక్ పే (కనీస వేతనం)ని ఈ ఫ్యాక్టర్​తో మల్టిప్లై చేయడం ద్వారానే.. సవరించిన కొత్త బేసిక్ శాలరీని లెక్కిస్తారు. కాబట్టి, 8వ పే కమిషన్ పరిధిలో ఈ రేషియో ఎంత ఉండబోతుందనే దానిపై దేశవ్యాప్తంగా ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ బడ్జెట్ పరిమితులను పరిగణనలోకి తీసుకుని ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను భారీగా పెంచకుండా నిరోధించే ఆలోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది!

ఈ వేతన సవరణ ప్రక్రియ ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సంభావ్య శ్రేణి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు, సవరించిన వేతనాలు-పెన్షన్ల వల్ల ప్రభుత్వాలపై పడే ఆర్థిక ప్రభా పై అంచనాలు వేసే దశకు చేరుకుందన...