భారతదేశం, ఆగస్టు 10 -- కడప జిల్లాలో ఎర్రచందనం ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. లంకమల్ల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల ఆకస్మిక దాడులు చేపట్టారు. 6 మంది ఎర్ర చందనం స్మగ్లర్లతో పాటు సుమారు 1 టన్ను బరువున్న 52 ఎర్రచందనందుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో మోస్ట్ వాంటెడ్‌ స్మగ్లర్‌ గా పేరొందిన నాగదస్తగిరిరెడ్డి కూడా ఉన్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటించారు.

ఆగస్ట్ 9వ తేదీన చాపాడు మండలం ప్రొద్దుటూరు - అన్నవరం రోడ్డులో వాహనాల తనీఖీలు చేపట్టారు. ప్రొద్దటూరు వైపు నుంచి దుంగలను తరలిస్తున్న ఒక ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ కార్లను తనిఖీ సిబ్బంది గమనించింది. పోలీసులను గమనించిన స్మగ్లర్లు. తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు. ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్దనుండి దుంగలతో పాటు వెహికల్స్ ను...