భారతదేశం, ఫిబ్రవరి 6 -- వైభవ్ సూర్యవంశీ మరోసారి సునామీ సృష్టించాడు. తనకు ఏ మ్యాచ్ అయినా బాదడమే తెలుసన్నట్లుగా అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 80 బంతుల్లోనే 15 సిక్స్‌లు, 15 ఫోర్లతో 175 రన్స్ చేయడం విశేషం. అతని దూకుడుతో ఫైనల్లో ఇండియా అండర్ 19 టీమ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 రన్స్ చేసింది.
సాధారణంగా ఫైనల్ మ్యాచ్ అంటేనే ఒత్తిడి ఉంటుంది. వికెట్ కాపాడుకోవడానికి ఆచితూచి ఆడుతుంటారు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. హరారే వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఈ టీనేజ్ సంచలనం ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
ఇంగ్లాండ్ బౌలర్ల ప్లాన్లను తలకిందులు చేస్తూ వైభవ్ బ్యాట్ ఝులిపించాడు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇది ఏదో ఆవేశంతో ఆడిన ఇన్నింగ్స్ కాదు.. గ్రౌండ్లో అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.