భారతదేశం, డిసెంబర్ 27 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల చిరకాల నిరీక్షణకు తెరపడనుంది. 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలపడంతో, జీతభత్యాల సవరణ ప్రక్రియ ఊపందుకుంది. అయితే, అందరి దృష్టి ఇప్పుడు ఒకే విషయంపై ఉంది.. అదే 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' (Fitment Factor). అసలు ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? ఇది ఉద్యోగుల జీతాలను ఎలా ప్రభావితం చేస్తుంది? నిపుణుల లెక్కలేమిటో ఓసారి చూద్దాం.

ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనాన్ని (Basic Pay) నిర్ణయించే ఒక గుణకాన్ని 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' అంటారు. సరళంగా చెప్పాలంటే, పాత వేతన సంఘం నుంచి కొత్త వేతన సంఘానికి మారేటప్పుడు జీతాలను ఎంత పెంచాలో ఈ ఫ్యాక్టరే నిర్ణయిస్తుంది. దీనిని ప్రధానంగా దేశంలోని ద్రవ్యోల్బణం (Inflation) ...