భారతదేశం, అక్టోబర్ 7 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతభత్యాల సవరణకు సంబంధించి 8వ వేతన సంఘం (8th Pay Commission) కీలక అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బెంగళూరులో నేడు (అక్టోబర్ 7) నుంచి రెండు రోజుల పాటు వివిధ ఉద్యోగ, పింఛనుదారుల సంఘాలతో ప్యానెల్ సంప్రదింపులు జరపనుంది. అక్టోబర్ 8న ఇక్కడి సమావేశాలు ముగిసిన అనంతరం, కమిషన్ బృందం అక్టోబర్ 22, 23 తేదీలలో ముంబైలో భేటీ కానుంది.

బెంగళూరు సమావేశాలకు సంబంధించి కమిషన్ నిర్దిష్ట ఎజెండాను అధికారికంగా ప్రకటించనప్పటికీ, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న సంప్రదింపుల్లో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను స్పష్టంగా వినిపిస్తున్నాయి. వేతనాల పెంపు, పింఛన్లు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఉద్యోగుల మనోధైర్యం, ఇతర సర్వీసు సంబంధిత సమస్యలపై ప్యానెల్‌కు వినతిపత్రాలు సమర్పిస్తున్నాయి. ...