భారతదేశం, నవంబర్ 22 -- 8వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల కోసం దేశవ్యాప్తంగా కోటికి పైగా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమ వేతనాలు ఎంత పెరుగుతాయి, ఏరియర్స్ ఎప్పటి నుంచి అందుతాయి అన్న సందేహాల నడుమ నేషనల్ కౌన్సిల్ (జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ - ఎన్​సీ-జేసీఎం) స్టాఫ్ సైడ్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా కీలక విషయాలు వెల్లడించారు. ఉద్యోగుల తరఫున కమిషన్‌తో సంప్రదింపులు జరుపుతున్న ప్రధాన నేతల్లో ఒకరైన ఆయన, ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తాజా పరిస్థితిని వివరించారు. 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్‌ను కమిషన్ ఆమోదిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని, అయితే 2026 జనవరి నుంచే బకాయిలు రావడం మాత్రం వంద శాతం ఖాయమని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం నిర్ణయాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ...