భారతదేశం, నవంబర్ 3 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం కసరత్తు వేగవంతమైంది. పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలు, పెన్షన్లను భారీగా సవరించాలని పలు కేంద్ర ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సమాఖ్యలు వేతన సంఘానికి తమ అధికారిక వినతిపత్రాలను సమర్పించాయి.

ముఖ్యంగా పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పరిధిలోకి వచ్చే పింఛనుదారులు ఈ 8వ పే కమిషన్ సిఫార్సులపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా తమ నెలవారీ బేసిక్ పెన్షన్ ఎంతవరకు పెరిగే అవకాశముందో అని ఎదురుచూస్తున్నారు.

మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వేలాది మంది కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు (రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఇన్‌కమ్‌టాక్స్ విభాగాలు) నివసిస్తున్నారు. కేంద్ర పే కమిషన్ సిఫా...