భారతదేశం, నవంబర్ 8 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణను ఖరారు చేసే 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటై 2026 నవంబర్ 3 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. తుది నివేదికను సమర్పించేందుకు కమిషన్‌కు మరో ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వేతనాల పెంపు, అలవెన్సులు, పెన్షన్ సంస్కరణలతో పాటు అత్యంత కీలకమైన 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' (Fitment Factor) ఖరారుపై కమిషన్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

పదేళ్లకు ఒకసారి మాత్రమే పే కమిషన్ ద్వారా వేతనాలు, పెన్షన్లను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉద్యోగులకు లభిస్తుంది. మార్కెట్‌లో నిత్యావసరాల ధరల పెరుగుదలకు అనుగుణంగా తమ కొనుగోలు శక్తిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఉద్యోగ సంఘాలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి.

ఎన్సీ-జేసీఎం స్టాఫ్ సైడ్ (NC-JCM Staff Side) 3.833 రెట్ల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేస్తుండ...