భారతదేశం, జూలై 18 -- 72nd National Film Awards: ఇండియన్ సినీ ప్రపంచం, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. శనివారం (జూలై 18) ప్రకటించిన 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కమిటీ కుర్రోళ్లు' అవార్డు అందుకుంది.

2024లో రిలీజైన సినిమాలకు గాను ఇవాళ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కమిటీ కుర్రోళ్లు' నిలిచింది. దీనికి యదువంశీ డైరెక్టర్. మెగా డాటర్ కొణిదెల నిహారిక ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన ఫస్ట్ మేజర్ సినిమా ఇది.

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో పెద్ద పెద్ద సినిమాలను కమిటీ కుర్రోళ్లు వెనక్కి నెట్టింది. పుష్ప 2, కల్కి 2898 ఏడీ లాంటి చిత్రాలను దాటి మరీ కమిటీ కుర్రోళ్లు ఈ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. నేషనల్ అవార్డు పొం...