భారతదేశం, ఆగస్టు 9 -- షియోమీ తన నూతన బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 15 5జీని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మలేషియాలో విడుదల అయింది. ఆగస్టు 19న రెడ్‌మీ 15 5జీ మనదేశంలో కూడా లాంచ్ కానుంది. రెండు మోడళ్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ ఫోన్, ధర ఫీచర్లు తెలుసుకుందాం..

రెడ్‌మీ 15 5జీ స్మార్ట్‌ఫోన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. తడి చేతులతో కూడా ఉపయోగించగల వెట్ టచ్ టెక్నాలజీ 2.0ను ఈ ఫోన్ స్క్రీన్‌లో అమర్చారు. ఈ ఫోన్ యూఎస్పీలో పవర్‌ఫుల్ 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 18 వాట్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో సర్కిల్ టు సెర్చ్, ఏఐ ఎరేజర్, డైనమిక్ షాట్స్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. రెడ్‌మీ 15 5జీ ధర, లభ్యత మలేషియాలో 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.15,091గా ఉంది. రిపుల్ గ్రీన్, టైటాన్ గ్రే, మిడ్నైట్ బ్లాక్ రంగుల్లో లభ...