భారతదేశం, జూలై 20 -- పవర్‌ఫుల్ బ్యాటరీలతో కూడిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. భారీ బ్యాటరీలు ఉన్న ఫోన్లను కూడా యూజర్లు ఇష్టపడుతున్నారు. పెద్ద బ్యాటరీతో ఫోన్‌ను పదేపదే ఛార్జింగ్ పెట్టాలన్న టెన్షన్ ఉండదు. మీరు కూడా మీ కోసం శక్తివంతమైన బ్యాటరీ ఉన్న ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. మూడు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్లలో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది. బలమైన బ్యాటరీతో పాటు, ఫోన్లో గొప్ప ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా కూడా లభిస్తుంది. ఈ ఫోన్ల గురించి తెలుసుకుందాం.

రియల్ మీ నుంచి వచ్చిన ఈ ఫోన్ లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 15 నిమిషాల్లో 1 నుంచి 50 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. డైమెన్సిటీ 8400 మ్యాక్స్ చిప్ సెట్ ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అ...