భారతదేశం, నవంబర్ 4 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి త్వరలోనే ఒక కొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​ ఇండియాలోకి రానుంది. దాని పేరు ఒప్పో రెనో 15. ఈ సిరీస్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రానప్పటికీ, తాజా లీక్స్ ప్రకారం​ ఇందులోని అన్ని మోడల్స్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌లు ఉంటాయని తెలుస్తోంది.

రెనో 14 స్మార్ట్​ఫోన్​ సిరీస్ తర్వాత రాబోతున్న ఈ కొత్త లైనప్‌లో ఈసారి మూడు మోడల్స్ ఉండే అవకాశం ఉంది. అవి..

ప్రస్తుతం, బేస్ మోడల్ రెనో 15గా భావిస్తున్న ఒక హ్యాండ్‌సెట్ వివరాలు గీక్‌బెంచ్​లో కనిపించాయి. ఇది మీడియాటెక్​ డైమెన్సిటీ 8450 చిప్‌తో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఒప్పో పీఎల్​వీ110 మోడల్ నంబర్‌తో ఉన్న హ్యాండ్‌సెట్ (ఇదే స్టాండర్డ్ ఒప్పో రెనో 15గా అంచనా వేస్తున్నారు) వివరాలు గీక్‌బెంచ్ లిస్టింగ్‌ల...