భారతదేశం, సెప్టెంబర్ 16 -- పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ విద్యా సంస్థల మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రైవేట్ కళాశాలలకు మొత్తం బకాయిలు రూ.1,200 కోట్లలో రూ.600 కోట్లు వెంటనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నందుకు నిరసనగా తెలంగాణలోని ప్రైవేట్ కళాశాలలు సెప్టెంబర్ 15 సోమవారం నుండి నిరవధిక సమ్మెను ప్రారంభించాయి. సెప్టెంబర్ 15న ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో విస్తృతంగా చర్చలు జరిపింది ప్రభుత్వం. రూ.600 కోట్లు వెంటనే చెల్లించేందుకు అంగీకరించింది. మిగిలిన బకాయిలను నెలవారీ ప్రాతిపదికన చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు.

ఫీజుల హేతుబద్ధీకరణ కోస...