భారతదేశం, ఆగస్టు 9 -- అమెరికాలో విదేశీ ఉద్యోగులకు గడ్డుకాలం రానుంది! ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులు మరో ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గడువును ఎత్తివేసే ఆలోచనలో అమెరికాలోని అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

ఈ ప్రతిపాదన ప్రస్తుతం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) పరిశీలనలో ఉంది. ఇది ఇంకా అధికారిక నిబంధనగా మారలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా బహిరంగం కాలేదు.

కానీ ఈ నిబంధన కనుక అమలైతే, ఉద్యోగాలు కోల్పోయిన విదేశీయులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు దాదాపు వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. నిర్ణీత గడువు కంటే ముందే ఉద్యోగం పోతే లభించే 60 రోజుల వెసులుబాటును ఈ తాజా ప్రతిపాదన పూర్తిగా తొలగిస్తుంది.

అమెరికా తీసుకునే ఈ నిర్ణయం అక్కడి ప్రవాస భారతీయ వర్గాలపై అత్...