భారతదేశం, ఆగస్టు 18 -- భవిష్యత్తు అవసరాల కోసం సేవింగ్స్ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా మీరు పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా సురక్షితమైన జీవితాన్ని గడపాలనుకుంటే.. వెంటనే స్థిరమైన ఆదాయ మార్గాన్ని క్రియేట్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక స్కీమ్స్ అందిస్తోంది. 60 ఏళ్లు పైబడిన మహిళలకు స్థిరమైన, హామీతో వచ్చే రాబడిని పొందడానికి కొన్ని పథకాలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం అందించే కొన్ని సామాజిక, ఆర్థిక భద్రతా పథకాలు మహిళలకు ప్రత్యేక హామీనిస్తాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన, పదవీ విరమణ చేసిన మహిళలు స్థిరమైన రాబడిని అందించే పథకాల ద్వారా ఆర్థిక భద్రత పొందవచ్చు. మార్కెట్ అనిశ్చితితో సంబంధం లేకుండా పెట్టుబడులకు భద్రత కల్పించే, నిరంతర ఆదాయాన్ని అందించే కొన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాల గురించి చూద్దాం..

బ్యాంకులు ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్...