భారతదేశం, నవంబర్ 13 -- జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన గ్రహాల మార్పుల్లో రాహు-కేతువుల సంచారం ఎప్పుడూ ప్రత్యేకమే. భౌతికంగా కనిపించని ఈ రెండు ఛాయా గ్రహాలు మనుషుల జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. కంటికి కనిపించకపోయినా, వీటి ప్రభావం మాత్రం అత్యంత బలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

డిసెంబర్ 5న రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనుండగా, కేతువు సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారబోతున్నారు. సుమారు 18 నెలల (548 రోజులు) పాటు ఒకే సమయంలో ఈ రెండు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడం వల్ల అన్ని రాశులపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.

రాబోయే డిసెంబర్ 5వ తేదీన రాహువు అత్యంత కీలకమైన రాశి మార్పు చేయనున్నాడు. ఇప్పటివరకు కుంభ రాశిలో సంచరించిన రాహువు.. ఇకపై వెనకడుగు వేస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి క...