భారతదేశం, ఆగస్టు 10 -- మీరు 4 జీబీ ర్యామ్ ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఐటెల్ ఎ80 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. 4 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌ అయిన ఈ ఫోన్ ధర అమెజాన్ ఇండియాలో రూ.6,999గా ఉంది. ఈ ఫోన్ పై కంపెనీ 22 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అసలు ధర రూ.8,999. మీకు దీని మీద క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. దీంతో ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఫోన్ పై ఎక్స్ ఛేంజ్ బోనస్ ను కూడా అందిస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే అదనపు డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. రూ.6600 వరకు ఎక్స్ఛేంజ్ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఎంట్రీ లెవల్ ఫోన్లో ఎన్నో గొప్ప ఫీచర్లు ఉన్నాయి.

6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 720x1600 పిక్సెల్ రిజల్యూషన్‌న...