భారతదేశం, ఆగస్టు 3 -- LGBT A Legal Battle 50 Days Run Event: సామాజిక అంశాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న 'ఎల్‌జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్' చిత్రం విజయవంతంగా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఘనంగా విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ... ఈ సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా గౌరవప్రదమైన జీవితం ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన అని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తోందని తెలిపారు. సమాజంలో అందర...