భారతదేశం, డిసెంబర్ 31 -- నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు సాయి కుమార్. హీరోగా కూడా ఎంతగానో అలరించిన సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా శంబాల.

యుగంధర్ ముని దర్శకత్వం వహించిన శంబాల సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శంబాల విజయోత్సవ వేడుక అంటూ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నటుడు సాయి కుమార్ ఆసక్తికర విశేషాలు చెప్పారు.

సాయి కుమార్ మాట్లాడుతూ .. "అమ్మానాన్నల ఆశీర్వాదంతో 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇప్పుడు ఇలా 'శంబాల'తో హిట్టు ఇవ్వడం ఆడియెన్స్ గిఫ్ట్. సినిమా ఫ్లాప్ అయినా ప్రయత్నం ఆపొద్దు అని మా అమ్మ గారు నాకు చెబుతుండేవారు. అదే మాట ఆదికి క...