భారతదేశం, ఫిబ్రవరి 5 -- ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, మానసిక వైకల్యంతో ఉన్న తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ దారుణమైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, శాస్త్రీయ ఆధారాలతో పోలీసులు నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

అక్టోబర్ 2025లో దక్షిణ ముంబైలోని కామా అండ్ ఆల్ బ్లెస్ ఆసుపత్రి నుంచి పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. తీవ్రమైన కడుపునొప్పితో అడ్మిట్ అయిన 20 ఏళ్ల మానసిక వికలాంగురాలు 5 నెలల గర్భవతి అని వైద్యులు సమాచారం అందించారు. బాధితురాలు మాట్లాడలేని స్థితిలో ఉండటంతో, ఆమెపై ఎవరో ఒకరు కాదు, పలువురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

కేసును సవాలుగా తీసుకున్న అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశ్విని పాటిల్ బ...