భారతదేశం, ఏప్రిల్ 6 -- మహిళల జీవితంలో 45 ఏళ్లు దాటిన తర్వాత శారీరకంగా, హార్మోన్ల పరంగా ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మోనోపాజ్ (రుతువిరతి) దశకు చేరుకుంటున్నప్పుడు శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు వేగంగా పడిపోతాయి. ఈ హార్మోన్ మార్పుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో ప్రధానమైనది మరియు అత్యంత ప్రమాదకరమైనది 'ఫ్యాటీ లివర్' (కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం).

మహిళల్లో 45 ఏళ్ల తర్వాత కాలేయంలో కొవ్వు ఎందుకు వేగంగా పెరుగుతుందనే విషయాలను చెన్నైలోని ఎంజీఎం మలార్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కనగ లక్ష్మి కె. వివరించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

"45 ఏళ్ల తర్వాత చాలా మంది మహిళలు పెరిమోనోపాజ్ లేదా మోనోపాజ్ దశలోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ విపరీతంగా తగ్గిపోతుంది. సాధారణంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ శరీరంలో కొవ్వు ...