భారతదేశం, సెప్టెంబర్ 26 -- కత్రినా కైఫ్, సల్మా హాయక్, హాలీ బెర్రీ వంటి సెలబ్రిటీలను చూస్తే.. మాతృత్వానికి వయసు ఒక అడ్డంకి కాదని తెలుస్తోంది. కెరీర్ లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత సంసిద్ధత వంటి కారణాల వల్ల చాలా మంది మహిళలు ఇప్పుడు ఆలస్యంగా పిల్లలను కనడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 40 ఏళ్లలో గర్భధారణ గురించి డాక్టర్లు ఏమంటున్నారో చూద్దాం.

"ఈ మధ్య కాలంలో పిల్లలను ఆలస్యంగా కనాలని నిర్ణయించుకునే మహిళల సంఖ్య బాగా పెరిగింది. ఇది అసాధారణం ఏమీ కాదు. సరైన వైద్య సంరక్షణ, తగిన జాగ్రత్తలతో చాలామందికి మంచి ఫలితాలు వస్తున్నాయి" అని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్, ప్రసూతి, గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ నీలమ్ సూరి తెలిపారు.

ఇరవైల్లో లేదా 30ల ప్రారంభంలో గర్భంతో పోలిస్తే 40ల్లో రిస్క్‌లు ఎక్కువగా ఉంటాయని డాక్టర్...