భారతదేశం, డిసెంబర్ 31 -- బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' సినిమా సునామీ సృష్టిస్తోంది. విడుదలైన నాలుగో వారంలో కూడా ఈ సినిమా జోరు తగ్గకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా ఏ సినిమాకైనా నాలుగో వారం వచ్చేసరికి వసూళ్లు తగ్గుముఖం పడతాయియ. కానీ, రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మాత్రం సోమవారం కంటే మంగళవారం ఎక్కువ వసూళ్లను రాబట్టి తన సత్తా చాటుతోంది.

ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, 26వ రోజైన మంగళవారం (డిసెంబర్ 30) దురంధర్ సినిమా దేశవ్యాప్తంగా సుమారు రూ. 11.25 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో కలిపి భారత్‌లో ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ. 712 కోట్లకు చేరుకున్నాయి.

గత శని, ఆదివారాల్లో వరుసగా రూ. 20 కోట్లు, రూ. 22.5 కోట్లు సాధించిన దురంధర్ సోమవారం రూ. 10.5 కోట్లు రాబట్టింది. భారతీయ సినీ చరిత్రలో దేశీయ మా...