4 గోల్డ్.. 1 సిల్వర్.. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ ఒలంపియాడ్లో భారత విద్యార్థుల సత్తా!
భారతదేశం, అక్టోబర్ 6 -- ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర రంగాల్లో భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి మన త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. వియత్నాం రాజధాని హనోయ్లో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 5 వరకు నిర్వహించిన 19వ 'ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్' (ఐఓఏఏ) పోటీల్లో భారత బృందం చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. పోటీల్లో పాల్గొన్న ఐదుగురు విద్యార్థులూ పతకాలు సాధించి నూటికి నూరు శాతం విజయశాతాన్ని నమోదు చేశారు. నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో భారత్ ఓవరాల్ పతకాల పట్టికలో ఆతిథ్య వియత్నాంతో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచింది. ఐదేసి స్వర్ణ పతకాలతో ఇరాన్, దక్షిణ కొరియా అగ్రస్థానంలో నిలిచాయి.
ఈ ఘనతలో మన భాగ్యనగర కుర్రాడు ప్రాంజల్ దీక్షిత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హైదరాబాద్కి చెందిన ప్రాంజల్ దీక్షిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.