భారతదేశం, సెప్టెంబర్ 23 -- ఆంధ్రప్రదేశ్‌లో శిథిలావస్థకు చేరిన 352 వంతెనల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని, ఇందుకు రూ.1432 కోట్లు కావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వంతెనలు, రహదారులపై శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్దన్ సమాధానం ఇచ్చారు.

'కొత్త వంతెనల నిర్మాణం కోసం కేంద్ర ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతిపాదించింది. రాష్ట్రంలో చాలా రహదారులు ఇటీవల వర్షాలకు పాడైపోయాయి. వానాకాలం తర్వాత వాటికి మరమ్మతులు చేస్తాం.' అని బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు.

మరోవైపు గృహ‌, పారిశ్రామిక‌, వ్యవసాయ అవ‌స‌రాల భ‌విష్యత్ డిమాండ్ తీర్చడానికి ట్రాన్స్ కో ప‌రిధిలోని 68 ప్రాంతాల్లో రూ.5,500 కోట్లతో వివిధ అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ స‌బ్ స్టేష‌న్లకు...