భారతదేశం, డిసెంబర్ 30 -- మొన్నటి వరకు బిగ్ బాస్ 9 తెలుగు హవా కొనసాగింది. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ విజేతగా కల్యాణ్ పడాల కాగా.. రన్నరప్‌గా తనూజ గౌడ, సెకండ్ రన్నరప్‌గా డిమాన్ పవన్ నిలిచారు. అయితే, తాజాగా ఈ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కంటెస్టెంట్స్ అంతా ఆదివారం విత్ స్టార్ మా పరివారం టీవీ షోలో పాల్గొని సందడి చేశారు.

యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా చేస్తున్న ఈ షోలో డిమాన్ పవన్‌కు స్టేజీపైనే అందరి ముందు ముద్దులు పెట్టేసింది రీతూ చౌదరి. దీనికి సంబంధించిన ఆదివారం స్టార్ మా పరివారం లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రోమోలో బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.

"బిగ్ బాస్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి. మూడు నెలల్లో మీరు చూసిన ఎంటర్‌టైన్‌మెంట్ మా పరివారంలో రెండు గంటల్లో ఇవ్వబోతున్నాం. గెట్ రెడీ" అంటూ శ్రీముఖి చెప్పింది. "ఫస్ట్ ఏ...