భారతదేశం, ఏప్రిల్ 23 -- CM Revanth Reddy Review : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహాన్ని కేవలం ఒప్పందాలకే పరిమితం చేయకుండా, వాటిని క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ అంతర్జాతీయ వేదికలపై ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలు త్వరితగతిన అమలు కావాలన్నారు. ఇందుకోసం కంపెనీలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను యుద్ధప్రతిపాదికన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పలు కంపెనీలతో కుదిరిన ఎంవోయూలు కార్యరూపం దాల్చడంలో ఆయా సంస్థల కార్యకలాపాల పురోగతిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు.

పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించి పే...