భారతదేశం, ఆగస్టు 25 -- ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే 'ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబి' (మౌలిద్) వేడుకలకు దేశవ్యాప్తంగా సర్వం సిద్ధమైంది. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 25 సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే ఈ పవిత్ర ఉత్సవాలు ఆగస్టు 26న ముగుస్తాయి. పండుగ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం బుధవారం నాడు తెలంగాణ సహా 14కు పైగా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మూడో నెల అయిన రబీ-ఉల్-అవ్వల్ 12వ రోజున ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబి వేడుకలను నిర్వహిస్తారు. మానవాళికి ప్రేమ, కరుణ, న్యాయం, సమానత్వం వంటి ఉన్నత విలువలను అందించిన మహమ్మద్ ప్రవక్త క్రీస్తుశకం 570 ప్రాంతంలో మక్కా నగరంలో జన్మించారు. ఆయన జన్మించిన రోజే పరమపదించడంతో, ముస్లిం సమాజం ఈ దినాన్ని ఆధ్యాత్మిక చింతనతో గడుపుతుంది. మస...