భారతదేశం, నవంబర్ 26 -- ముంబై 26/11 ఉగ్రదాడిలో తన 20 ఏళ్ల కూతురు అమీనా బేగంను కోల్పోయి, భర్త అంగవైకల్యంతో నరకయాతన అనుభవించిన నిజామాబాద్ వాసి నూర్జహాన్ బేగం గురువారం మరోసారి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తమ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆర్థిక సాయం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఏఎన్‌ఐ(ANI)తో మాట్లాడుతూ. నూర్జహాన్ బేగం గుర్తు చేసుకున్నారు. అజ్మీర్ నుంచి హాజీ అలీ దర్గా దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ముంబై వెళ్లినట్లు తెలిపారు. అక్కడి నుంచి సీఎస్టీ రైల్వే స్టేషన్ మీదుగా నిజామాబాద్‌కు తిరిగి రావాల్సి ఉందన్నారు. అయితే డెక్కన్ ఎక్స్‌ప్రెస్ రైలు మిస్ కావడంతో, రాత్రి 9 గంటల నుంచి 9:30 గంటల మధ్య మరో రైలు కోసం వేచి చూస్తుండగా ఉగ్రవాదులు అకస్మాత్తుగా విచక్షణారహితంగా కాల్...