భారతదేశం, అక్టోబర్ 6 -- గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్‌లోని జనార్దనపురంలో నూతన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలోని 24 జిల్లాల్లో మరో 266 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను వర్చువల్‌గా ఏకకాలంలో ప్రారంభించారు. వీటి నిర్మాణానికి సుమారు రూ.105 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల పరిధిలో ఈ భవనాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి చెప్పారు.

రాబోయే 6 నెలల్లో మిగిలిన 4,400 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఇందు...