భారతదేశం, నవంబర్ 12 -- డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో 22ఏ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు, ఎదుర‌వుతున్న స‌మ‌స్యలపై హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 22A భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు చెప్పారు. 22A సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీల‌కు అనుగుణంగా జీవో 118, జీవో 76లకు సంబంధించి మెమోలు జారీ చేశామన్నారు.

ఆదేవిధంగా 22A జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ...