భారతదేశం, జూన్ 25 -- ెనాల్ట్ ఇండియా ఇప్పుడు భారతదేశంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. 2020లో క్యాప్చర్, 2022లో డస్టర్‌లను నిలిపివేసిన తర్వాత క్విడ్ , ట్రైబర్, కిగర్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కానీ అమ్మకాల సంఖ్య మాత్రం అంత సరిగాలేదనే చెప్పాలి. కొంతకాలం క్రితం కంపెనీ కిగర్ ఈవీని తీసుకురాబోతోందని న్యూస్ వచ్చింది. కానీ తర్వాత కొన్ని రోజులకు ఈ విషయం సైలెంట్ అయిపోయింది. రెనాల్ట్ కంపెనీ భారతదేశంలో లాంచ్ చేసేందుకు ఈవీ, సీఎన్జీపై మళ్లీ పని చేస్తోంది. ఇక్కడ కొత్త క్విడ్ ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది.

2026 లో కొత్త డస్టర్, బోరియల్‌లను విడుదల చేయడానికి రెనాల్ట్ సిద్ధంగా ఉంది. దీని తరువాత హైబ్రిడ్ వెర్షన్లు కూడా మార్కెట్‌లోకి వస్తాయి. అయితే ఇదే సమయంలో రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారును కూడా విడుదల చేయవచ్చని తెలుస్తోంది. నివ...