భారతదేశం, అక్టోబర్ 4 -- ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో అత్యంత కీలకమైన, భౌగోళికంగా క్లిష్టమైన ఘట్టం పూర్తయిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. టన్నెల్ నిర్మాణంలో నిరంతరం సవాళ్లు విసిరిన ప్రమాదకరమైన షియర్ జోన్‌ను దాటుకుని తవ్వకాల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు.

టన్నెల్ పనులపై హైదరాబాద్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.

సమీక్షా సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల పురోగతికి సంబంధించిన వివరాలను మంత్రి మీడియాతో పంచుకున్నారు. గడిచిన ఆరు నెలల కాలంలో సుమారు 700 మీటర్ల మేర సొరంగం తవ్వకం పనులను విజయవంతంగా పూర్తి చేశామన్నా...