భారతదేశం, మే 21 -- Tata Tiago facelift : ఈ ఏడాది తొలినాళ్లల్లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్​ లాంచ్​తో సక్సెస్​ సాధించిన టాటా మోటార్స్.. ఇప్పుడు తన మోస్ట్ పాపులర్ ఎంట్రీ-లెవెల్ హ్యాచ్‌బ్యాక్ లైనప్‌ను అప్‌డేట్ చేసింది. రాబోయే మే 28న జరగనున్న అధికారిక లాంచ్‌కు ముందే కంపెనీ సరికొత్త 'టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్', 'టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్' మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. చాలా కాలం తర్వాత ఈ మోడళ్లకు జరిగిన మొదటి మేజర్ డిజైన్ అప్‌డేట్ ఇది. ఈ నేపథ్యంలో వీటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఈ టాటా టియాగో, టాటా టియాగో ఈవీ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ల ఎక్స్​టీరియర్​ని టాటా పూర్తిగా మార్చేసింది.

ఫ్రంట్ లుక్: కారు ముందు భాగంలో ఐబ్రో ఆకారంలో ఉండే సరికొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, సరికొత్త హెడ్‌లైట్ డిజైన్‌ను అందించారు. పెట్రోల్ వెర్షన్‌లో ఆల్ట్రోజ్ కార...