Andhrapradesh, సెప్టెంబర్ 21 -- రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు కాలుష్య రహితంగా మార్చేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ ఉద్యమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ద్వారా 2026 జూన్ నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని ఆయన వెల్లడించారు. శనివారం పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

చెరువు గట్టు, పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా ఉన్న చెత్తను, గట్టు వద్ద పేరుకుపోయిన వ్యర్ధాలను మున్సిపల్ కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు తొలగించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. సఫాయి కార్మికులు, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి సంభాషించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.52 కోట్ల వ...