భారతదేశం, ఆగస్టు 22 -- కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన తర్వాత కాలం ఎలా మారుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడుల విషయంలో రాబోయే రోజులు ఎలా ఉంటాయనే దానిపై అందరి దృష్టి ఉంటుంది. గ్రహాల గమనం, రాశుల స్థితిగతులను బట్టి ప్రతి ఒక్కరి జీవితంలోనూ మార్పులు సహజం.

ప్రముఖ జ్యోతిషాచార్యుల అంచనాల ప్రకారం, 2026 సంవత్సరం ముగిసే నాటికి కొన్ని రాశుల వారికి ఆర్థిక కష్టాల నుంచి గట్టి ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా మిథున, కర్కాటక, వృశ్చిక రాశుల వారికి ఈ కాలం అత్యంత లాభదాయకంగా మారనుందని అంచనా వేస్తున్నారు.

మిథున రాశి వారికి రాబోయే రోజులు కెరీర్ పరంగా ఎంతో కీలకమైనవి. ఉద్యోగం చేసేవారు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందుకుంటారు. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరగడంతో పాటు పదోన్నతి లేదా వేతనం పెరిగే సూచనలున్నవి. ప్రస్తుత ఉద్యోగం నుంచి వేరే మంచ...