భారతదేశం, డిసెంబర్ 22 -- 2025 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. 2026 అడుగు దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది 2026 క్యాలెండర్​ తీసుకుని, హాలీడేల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే, 2026లో అనేక సెలవులు వరుసగా వస్తున్నాయి! ముఖ్యంగా జనవరిలో 2, అక్టోబర్ నెలలో మూడు లాంగ్ వీకెండ్లు రావడం విశేషం. ఇలా లాంగ్​ వీకెండ్​లు ఉంటే, ఎక్కడికైనా ట్రిప్​కి వెళ్లాలని లేదా ఉరుకుల పరుగుల జీవితం నుంచి బ్రేక్​ తీసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో 2026 లాంగ్​ వీకెండ్​ క్యాలెండర్​ వివరాలను ఇక్కడ చెక్​ చేసుకుని, మీ బ్రేక్​ని ప్లాన్​ చేసుకోండి..

2026 జనవరి 1 (గురువారం)తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మీరు గనుక శుక్రవారం (జనవరి 2) ఒక్కరోజు సెలవు పెడితే, శని, ఆదివారాలతో కలిపి వరుసగా నాలుగు రోజులు హాలీడేని చేయవచ్చు!

మరోవైపు జనవరి నెలాఖరులో కూడా లాం...